Minister Ambati Rambabu : రాష్ట్రం శ్రీలంకలా అయిపోవాలి, పోలవరం ఆగిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అమరావతిలోని 29 గ్రామాలు తప్ప ఇంకేమీ బాగుపడకూడదని చంద్రబాబు ఆలోచన అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు అండ్ కో పక్క రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  మూడు రాష్ట్రాలు వాళ్ల అనుమానాలు వ్యక్తం చేశారని, కేంద్రం నివృత్తి చేసిందన్నారు.  భద్రాచలానికి ముప్పేం లేదని కేంద్రం తేల్చి చెప్పేందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  పోలవరంపై జరగాల్సిన సర్వే లు అన్ని ఎప్పుడో అయిపోయాయన్న ఆయన, అన్ని క్లియరెన్స్ లు వచ్చాయని చెప్పారు. దేవుడిని అడ్డం పెట్టుకొని మాయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  


టీడీపీ భజన యాత్ర 


అమరావతి రైతుల పాదయాత్ర కాదని, ఒళ్లు బలిసిన వారి పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అంతా టీడీపీ భజన అంటూ విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, వాళ్లు తిరిగి ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదన్న మంత్రి, ఏం జరిగినా బాధ్యత ఆయనదేనని తేల్చిచెప్పారు. 


ఆ అర్హత హరీశ్ రావుకు లేదు


"హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు. హరీశ్ కి కేసీఆర్ కు తగాదాలు ఉంటే అక్కడ తేల్చుకోవాలి. మమల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావుకు, కేసీఆర్ కు లేదు. లోటు బడ్జెట్ లో ఉన్నా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? వీటిపై మాతో హరీశ్ రావు చర్చకు సిద్ధమా? రాజకీయాల్లో వారసులు ఎవరూ ఉండరు. వారసులకి ప్రజల ముద్ర ఉండాలి. ప్రజల ముద్రతో వారసులు వేస్తే తప్పేంటి? మా పార్టీ బలంగా ఉంది కనుక ఇది మంచి సమయం అని మా వాళ్లు కొందరు అనుకుంటున్నారేమో తప్పేంటి?"- మంత్రి అంబటి రాంబాబు 


చంద్రబాబు ఆ మాట చెప్పగలరా? 


 మాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు అందించామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నామన్నారు.సీఎం జగన్‌ కన్నా గొప్ప పరిపాలన చేశామని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రజలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి కొందరు రాయరన్నారు. పోలవరం నాశనం అయిపోవాలన్నదే చంద్రబాబు కోరిక అంటూ మండిపడ్డారు.  బినామీ పేర్లతో భూములు కొన్న అమరావతి మాత్రం వెలిగిపోవాలన్నదే చంద్రబాబు కోరిక అన్నారు. గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడూ లేదన్నారు. ఏదైనా పథకం అమలు చేస్తే కదా చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లేది అంటూ ఎద్దేవా చేశారు. పోలవరంపై పక్క రాష్ట్రాలు మాట్లాడుతుంటే హడావుడి చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.   


Also Read : TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?