Agnipath Protests Telugu Live Updates: నాలుగో ట్వీ20లో భారత్ ఘన విజయం
Breaking News Telugu Live Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ భారత్ ను 2-2తో సమం చేసింది. వరసగా రెండో విజయం సాధించి సిరీస్ లో ఆశలు సజీవం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 169/6 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓటర్లలో 87/9 స్కోరుకే పరిమితం అయింది. దీంతో భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా(8) రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దీంతో రైళ్ల పునరుద్ధరణకు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే నగరంలో నడిచే మెట్రో రైళ్ల పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6.35 నుంచి మెట్రో రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను అరెస్టు చేస్తున్నారు. రాపిడ్ యాక్షన్ పోర్స్ రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరిలిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాత్రి 7 గంటల నుంచి రైళ్లు పునరుద్ధరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరసకారులు రైల్వేస్టేషన్ నుంచి వెనుదిరిగారు. ట్రాకుల నుంచి నిరసనకారులు వెనుదిరిగారు. కాసేపట్లో క్లియర్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు పనిచేసేందుకు సైనికుల నియామకానికి కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ నిరసన జ్వాలలు తాజాగా మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించాయి.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న యువత శాంతించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్ వల్ల యువతకు ప్రయోజనం ఉందన్నారు.
సికింద్రాబాద్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనపై అమిత్ షా సమీక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను అధికారులు మూసివేశారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు రావద్దని పోలీసులు హెచ్చరించారు.
పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. పోలీసులు కాల్పులు జరిపినా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లను అధికారులు నిలిపివేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సులను కూడా బంద్ చేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లపై అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయంపై చర్చిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
అగ్నిపథ్ అల్లర్లపై కేటీఆర్ ట్వీట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను భాజపా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
అగ్ని పథ్ రద్దు చేసి ఆర్బీ పరీక్షలు యథావిధిగా నిర్వహఇంచాలని వీరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని పథ్ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని యువకులు ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో యువకులు రైల్వే స్టేషన్‌లలోకి చొచ్చుకెళ్లారు. అంతోనే రైలు బోగీలకు కొందరు నిప్పు పెట్టగా, స్టేషన్ బయట బస్సులు, వాహనాలను సైతం కొందరు అల్లరి మూక ధ్వంసం చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోతుంది. ఆందోళనకారులు చెలరేగడంతో పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. కర్రలతో, రాళ్లతో రైళ్లను కొడుతూ, బోయి గూడ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ వద్ద ఉన్న ఇంజన్ కి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. ఈస్ట్ కోస్ట్ కు 5 బోగిల కు నిప్పు పెట్టగా.. పోలీసులు, రైల్వే కార్మికులు కలిసి బోగీల్లో మంటాలార్పుతున్నారు. రైల్వే పోలీసులకు సహాయం చేసేందుకు రెగ్యూలర్ పోలీసులు సికింద్రాబాద్‌కు చేరుకుంటున్నట్లు సమాచారం.
అగ్నిపథ్ ఆందోళనలు, సికింద్రాబాద్ రైల్వేష్టేషన్‌లో ఉద్రిక్తత, రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్ రైల్వేష్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. రైళ్లపై ఆందోళనకారులు రాళ్లువిసిరారు. దాంతో ప్రయాణికులు పరుగులుపెట్టారు. రైలుపట్టాల మధ్యలో నిప్పుపెట్టిన యువకులు, రైళ్లన్నింటినీ నిలిపివేసిన అధికారులు. రైల్వేస్టేషన్ బయట సైతం కొందరు అల్లరి మూక ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు.
Background
గత ఏడాదితో పోల్చితే వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.
సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించేందుకు యవతకు రక్షణ శాఖ ఇచ్చిన అవకాశం అగ్నిపథ్ పథకం. నాలుగేళ్ళపాటు దేశానికి సేవలందించడానికి అగ్నివీరులను నియమించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించడం తెలిసిందే. తాజాగా యువతకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. 'అగ్నిపథ్' పథకంలో భాగంగా ఆర్మీలో చేరి సేవలు అందించనున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇందులో చేరేందుకు గరిష్ట వయో పరిమితి 23కి చేరింది. పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసుగల వారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 17th June 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 17th June 2022) లీటర్ ధర రూ.111.57 కాగా, 19 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.33 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. 50 పైసలు పెరగడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.28 అయింది. డీజిల్‌పై 46 పెరగడంతో లీటర్ ధర రూ.99.01 అయింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids At JC Prabhakar Reddy Home) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈడీ తనిఖీలు చేపట్టిన సమయంలో జేసీ సోదరులు ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించిన ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి మొబైల్స్‌తో పాటు వారి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డిఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది.
హైదరాబాద్‌లోని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలోని కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ తనిఖీల నేపథ్యంలో వీరి నివాసాలను సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏకకాలంలో జేసీ బ్రదర్స్ ఇళ్లు, ఆస్తులపై ఈడీ సోదాలు చేపట్టగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -