Actor Ram Charan Tour In Pithapuram: మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం (Pithapuram) చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తల్లి, మామయ్యతో కలిసి పిఠాపురానికి వచ్చారు. దారిపొడవునా ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు స్వాగతం పలుకుతుండగా.. ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని వారు సందర్శించనున్నారు. ఆలయం వద్ద తమ అభిమాన నటుడి కోసం తాము ఎదురు చూస్తున్నామంటూ రామ్ చరణ్ వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో #RamCharan, #Pithapuram యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. 






బాబాయ్ తరఫున ప్రచారం చేస్తారా.?


అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో పోటీ చేస్తుండడం.. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. అయితే, సొంత బాబాయ్ తరఫున రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేస్తారా.? లేదా.? అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు, ఏపీ రాజకీయాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారా.? అని కూటమి శ్రేణులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కు మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన ఇటీవలే ఓ వీడియో విడుదల చేశారు. అందరిలో ఆఖరివాడు అయినప్పటికీ మంచి చేయడంలో ముందుండే వ్యక్తిని గెలిపించే అంతా మంచే జరుగుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ వీడియో వైరల్ కాగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్వీట్స్ చేశారు.


Also Read: Ap Elections 2024: ఓటేసేందుకు సొంతూళ్లకు పయనం - హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ