Yuvagalam Meeting :   నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా  విజయనగరం జిల్లా పోలిపల్లిలో నవశకం పేరుతో బహిరంగసభ నిర్వహించారు. ీ సభలో  టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు ేచశారు.  నేల ఈనిందా...ఆకాశానికి చిల్లుపడిందా...భీమిలి నుంచి సముద్రం పొలిపల్లికి వచ్చిందా అన్నట్లు సభాప్రాంగణానికి జనం తరలివచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు.  నారా లోకేష్ చంద్రబాబు వారసుడే కాదు...రాజకీయ పరిణితి కలిగిన నాయకుడని కుప్పం సభలోనే చెప్పానన్నారు.  పాదయాత్రలో నారా లోకేష్ బలమైన సైనికుడు అని కూడా రుజువు చేశారన్నారు.  జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసిందన్నారు.  పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు...బాధితులను ఓదార్చారని..   అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజల్లో ఎండగట్టాడు..యువతకు భరోసానిచ్చారని ప్రశంసించారు. 


బొత్స, ధర్మానకు  చీము, నెత్తురు ఉంటే రాజీనామాచేసి రావాలి ! 


చంద్రబాబు పైసా అవినీతి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టాడని..  2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలుస్తారని వైసిపి సైకోలు ఊహించలేదన్నారు.  మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మ అవసరం ఏర్పడిందన్నారు.  ప్రజలకు సుపరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నారని..  రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదని స్పష్టం చేశారు.  టీడీపీ, జనసేనలో బలహీన వర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు...వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారని..  విమర్శించారు.  ఉత్తరాంధ్ర జిల్లాలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చాడు...  బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ కు చీము, నెత్తరు ఉంటే తక్షణమే వైసీపీకి రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. 


వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రజలు - దోపిడీ దారుడికి  మధ్య యుద్ధం


ఉత్తరాంధ్రకు జగన్ చేస్తున్న అన్యాయంపై నిలదీసే దమ్ము మీకుందా అని ఉత్తారాంధ్ర నేతలను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.  ఉత్తరాంధ్రను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు...దోచుకున్నాడని..  టీడీపీ, జనసేన కలిశాయి...ఇక వైసీపీకి దబిడిదిబిడేనని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపికి డిపాజిట్లు కూడా రావన్నారు.  గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.  కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు..మనం అప్రమత్తంగా ఉండాలి. 2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నానన్నారు.  5కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి..రానున్న ఎన్నికలు టీడీపీ-జనసేన – వైసీపీ మధ్య ఎన్నికలు కాదు. రాష్ట్ర ప్రజలకు-దోపిడీదారుడికి మధ్య యుద్ధమన్నారు. 
 
యువగళం దేశ రాజకీయాల్లో కీలకఘట్టం :  రామ్మోహన్ నాయుడు 


యువగళం-నవశకం దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం కానుందని టిడిపి ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కుప్పంలో మొదలైన యువగళానికి అన్ని జిల్లాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టి విజయవంతం చేశారన్నారు.  మరో 100రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నాం..రాష్ట్రానికి పట్టిన శని వదలించుకోబోతున్నామని ప్రకటించారు.  రైతులు రారాజులు కాబోతున్నారు..నిరుద్యోగులు ఉద్యోగాల్లోకి వెళ్లబోతున్నారని తెలిపారు.  వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రాబోతున్నారు. మహిళలు ధైర్యంగా రోడ్లపై తిరగే స్వేచ్ఛ, భద్రత రాబోతోందని జోస్యం చెప్పారు.  2019 ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ పని అయిపోయిందనుకున్న వాళ్లంతా ఈ సభను తమ కళ్లతో చూడాలని..  తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పిల్లి ఎన్ని కుట్రలు పన్నినా మనం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.