Chandrababu Case Supreme Court Verdict:  బుదవారం  సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.   ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.  ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది ఏపీ హైకోర్టు .  ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.   జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనమే ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. 


చంద్రబాబు దాఖలు చేసిన పైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ   వాయిదాలు పడుతూ వస్తోంది.  17  ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు పెం తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తామని ధర్మాసనం చెప్పింది.  అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ పై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కానీ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో  విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేశారు. విస్తృత ధర్మాసనాన్ని సీజేఐ నిర్ణయించాల్సి ఉంది. 


ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగిస్తోంది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్‌ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తుంది. టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకం వ్యవహరించారని, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.  


ఏపీ సివిల్‌ సప్లైస్‌కు నాసిరకం ఈ-పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం టెర్రా సాఫ్ట్‌ను గతంలో బ్లాక్ లిస్టు పెట్టింది. అనంతరం టెర్రాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే ఈ సంస్థను లిస్ట్ నుంచి తొలగించారు అప్పటి అధికారులు. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో కలిసి టెర్రాసాఫ్ట్‌ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. అయితే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా టైరాసాఫ్ట్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. రూ.115 కోట్లతో నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది.