Today Top Headlines In Ap And Telangana:

1. ఏపీలో పుష్ప 2 ప్రదర్శిత థియేటర్లు సీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా తొలిరోజు దాదాపు రూ.280 కోట్లు రాబట్టి అల్లు అర్జున్ మూవీ సత్తా చాటింది. అయితే ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాపై ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. ఇంకా చదవండి.

2. శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ యాత్రలు ప్రారంభం

జనవరి నుంచి జిల్లా పర్యటనలు వెళ్లడానికి సిద్ధమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే కేడర్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమవుతున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించనున్నారు జగన్. ప్రతి బుధవారం, గురువారం అక్కడే ఉండి ప్రజలు,పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు గురించి తెలుసుకోనున్నారు. ఇలా జిల్లా పర్యటనలకు క్షేత్రస్థాయి కేడర్‌ను రెడీ చేస్తున్న జగన్ వారితో వరుస మీటింగ్‌లును ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా చదవండి.

3. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు

ఇటీవల ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో ఐదు నుంచి ఏడు రోజులపాటు వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీ, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, అన్నదాతలు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇంకా చదవండి.

4. యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం

యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. హైదరాబాద్‌ నుంచి కొందరు వ్యక్తులు కారులో పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ఈ ఘోరం జరిగింది.  మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆరుగురు యువకులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోతే... ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా చదవండి.

5. నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ టాప్ నిర్మాత దిల్‌రాజును తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌(TSFDC Chairman)గా ప్రభుత్వం నియమించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. తెలుగు ఇండస్ట్రీలో భారీ చిత్రాలనే కాదు చిన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు దిల్‌ రాజు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు  దిల్‌రాజు డ్రీమ్స్‌ పేరుతో కొత్త బ్యానర్‌ను క్రియేట్ చేశారు. ఈ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇంకా చదవండి.