Top Head lines In AP And Telangana:
1. కాకినాడ సెజ్, పోర్టు కేసుపై కీలక అప్‌డేట్
కాకినాడ సెజ్, పోర్టు కేంద్రంగా నమోదైన కేసులు వైసీపీ నేతల మెడకు గట్టిగా చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. కేవీ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడి బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇంకా చదవండి.
2. యాగంటి క్షేత్రంలో తీవ్ర విషాదం
అనంతపూర్ జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) తన 10 మంది స్నేహితులతో కలిసి యాగంటి విహారయాత్రకు వచ్చాడు. దర్శనం అనంతరం యాగంటిలోని పెద్ద కోనేరులో స్నేహితులతో ఈత కొట్టాడు ఈ సరదాలోనే ఓ పందెం వేసుకున్నారు. అదే అతని ప్రాణం తీసింది. అప్పటి వరకు ఈత కొట్టిన స్నేహితులంతా నీటిలో మునిగే పందెం వేసుకున్నారు. ఎవరు ఎంతసేపు నీటిలో ఉంటారో వాళ్లే విజేత అంటూ పందెం వేసుకున్నారు. సరదాగా అందరూ నీటిలో మునిగారు. నీటిలో మునిగిన సురేంద్ర అనే యువకుడు ఎంతకీ పైకి రాలేదు. ఇంకా చదవండి.
3. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి హరీష్‌రావు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి అభ్యర్థను తోసిపుచ్చింది. అయితే అరెస్టు చేయొద్దని విచారణ మాత్రం చేయాలని ఆదేశించింది. అధికారంలో ఉన్నప్పుడు హరీష్‌రావు ఓ అధికారితో కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులో ఎలాంటి మెరిట్ లేకుండానే తనపై కేసు నమోదు చేశారని వాదించారు. ఇంకా చదవండి.
4. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్
మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్‌లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో కౌశిక్ రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లిన హరీష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్‌రావును అక్కడి నుంచి తరలించేందుకు అరెస్టు చేశారు. ఇంకా చదవండి.
5. వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
ములుగు జిల్లా వాజేడులో ఎస్సై హరీష్ ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. ఓవైపు జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ విషయంపై చర్చ నడుస్తుండగానే ఎస్సై ఆత్మహత్య పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ హైదరాబాద్ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మిస్డ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇప్పుడు ఆయన ప్రాణాల మీదుకు వచ్చిందని అంటున్నారు. ఇంకా చదవండి.