ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. కొత్తగా 33,339 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 547 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వైరస్ కారణంగా విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు మెుత్తం 14,500 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 128 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు.  ప్రస్తుతం 2,266 మంది చికిత్స పొందుతున్నారు.






మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు భయందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు వరుసగా నమోదువుతూ ఉన్నాయి. నిన్న 4 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. మెుత్తం 28 కేసులకు చేరుకున్నాయి.  యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికీ, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు కూడా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.


దేశంలో పెరుగుతున్న కేసులు


దేశంలో కరోనా టాప్ గేర్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది.


19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్‌తో మృతి చెందారు. 







    • డైలీ పాజిటివిటీ రేటు: 6.43%

    • యాక్టివ్ కేసులు: 2,85,401

    • మొత్తం రికవరీలు: 3,43,41,009

    • మొత్తం మరణాలు: 4,82,876

    • మొత్తం వ్యాక్సినేషన్: 148.67 కోట్ల డోసులు



మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు.
మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి. 





కొత్త కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,57,032కు చేరింది. మరణాల సంఖ్య 1,41,581కి చేరింది. 




 


Also Read: ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.. మా పరిస్థితి కూడా చూడాలని చెప్పాం: ఉద్యోగ సంఘాల నేతలు


Also Read: CM Jagan With Employees: ఉద్యోగ సంఘాల నేతలు ప్రాక్టికల్ గా ఆలోచించండి.. త్వరలో పీఆర్సీపై ప్రకటన చేస్తాం


Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...