కరోనా అంటే ఒక్కొక్కరు వణికిపోతున్నారు. వైరస్ ను తేలిగ్గా తీసుకోవడం లేదు. కానీ మరీ.. అతి జాగ్రత్తగా ఉండేవారు తక్కువే. కరోనాతో ప్రాణాలు పొగొట్టుకున్న వారు ఉంటే.. అతిభయంతో చిత్ర విచిత్ర పనులు చేస్తున్నవారూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే కుటుంబం అలాంటిదే. అతిభయంతో 15 నెలలుగా ముగ్గురు మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. చిన్న గుడిసెలో పరదాలు కట్టుకుని దాని చాటున ఉన్నారు. కనీసం కాలు బయట పెట్టలేదు అంటే నమ్మండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటకు రాలేదు. మలమూత్రాలకూ ఆ గుడిసెనే ఉపయోగించారు. 


తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామం. యాభై ఏళ్ల జాన్ బెన్నీ... కుమారుడు 29 సంవత్సరాలు చినబాబు. ఏదో చిన్న సైకిల్ షాపు నడుపుతూ బతుకుతారు. జాన్ బెన్నీ భార్య.. వాళ్ల ఇద్దరు కుమార్తెలు ఏవేవో చిన్నచిన్న పనులకు వెళ్లేవారు. కానీ ఆ ముగ్గురు మహిళలు.. 15 నెలలపాటు గుడిసెలోనే బందీలైపోయారు. ఎవరో బందీస్తే కాదు.. కరోనా భయంతో వాళ్లే ఇంట్లో ఉన్నారు. జాన్ బెన్నీ, చినబాబు ఏదో ఒక టైమ్ లో బయటకు రావడం.. కావాల్సిన సరకులు తీసుకెళ్లడం.. ఇంతే జరిగింది. ఆ ముగ్గురు ఆడవాళ్లు గుడిసెలో నుంచి అస్సలు కాలు బయట పెట్టలేదు. 


ఈ విషయం ఎలా బయటపడిందంటే


ఈ మధ్య జగన్.. ప్రభుత్వం పక్కా ఇళ్ల పథకం పెట్టింది.. కదా.. దాని గురించే.. వాలంటీర్ అటువైపుగా వెళ్లాడు. ఇళ్ల పట్టా రావడంతో దానికి సంబంధించిన బయోమెట్రిక్ కోసం వాలంటీర్ వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది. గతంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆ ఇంటికి హెల్త్ సర్వేలో భాగంగా వెళ్లినప్పటికీ.. ఎవరూ లేనట్టు అనిపించగా వెనక్కి వెళ్లినట్టు తెలిసింది.


ఎందుకు వారికా భయం


15 నెలల క్రితం ఆ కుటుంబానికి చెందిన దగ్గరివారు కరోనాతో చనిపోయారట. అప్పటి నుంచి వాళ్లకు ఆ భయం పట్టుకుంది. ఇన్నీ రోజులు ఏం తిన్నారో.. ఎలా బతికారో.. వానొస్తే.. గుడిసెపై పరదా వెసుకునే వారు అంతే. ప్రస్థుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. పోలీసులు వాళ్లను రాజోలు ఆసుపత్రిలో చేర్పించారు.


 


Also Read: Corona: కరోనా థర్డ్ వేవ్ వచ్చిందా? ఇదే ఇండికేషన్!