ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 37,540 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేశారు. 24 గంటల్లో 286 కరోనా పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించారు. కరోనా నుంచి 307 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,196 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.






భారత్ కరోనా కేసులు


దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరాయి. 4.6 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.25 శాతంగా కొనసాగుతోంది. కొత్తగా 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లను దాటాయి.






మహారాష్ట్రలోని చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాక్సినేషన్ పై భిన్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. టీకా తీసుకునే వారికి ప్రోత్సాహకాలు అందించాలనుకుంటోంది. నవంబరు 12- 24 మధ్యలో టీకా తీసుకునే వారు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ ఉంది. చంద్రపూర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పౌరులు తమ సమీపంలోని ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే బహుమతులు ఎలా అందిస్తారంటే.. టీకా వేయించుకొన్న వారి పేర్లను లక్కీడ్రా తీసి విజేతలకు  బహుమతులను ఇస్తారు. లక్కీ డ్రాలో మెుదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్‌, రెండో బహుమతిగా వాషింగ్‌ మిషన్‌, మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ ఇవ్వనున్నారు. అంతేకాదు.. మరో 10 మందికి మిక్సర్ గ్రైండర్లను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు.


Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి