ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 35,332 మంది నమూనాలను పరీక్షించారు.  230 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 346 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 2,615 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


థర్డ్ వేవ్ పై భయందోళన


భారత్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్‌పై ఇప్పటికీ చాలా భయాలున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరోనా థర్డ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయని వ్యాక్సినేషన్‌పై అన్ని దేశాలు దృష్టి సారించాలన్నారు. 
" పశ్చిమ ఐరోపాలో చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో పలువురు ఆసుపత్రి పాలవుతున్నారు. దీనికి చాలానే కారణాలున్నాయి. అయితే మరణాలు మాత్రం అదుపులో ఉన్నాయి. దీనికి కారణం చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమంగా వేగంగా సాగుతోంది.                                                     "
                                         -డాక్టర్ స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్


వ్యాక్సిన్ సామర్థ్యంపై..
వ్యాక్సిన్ సామర్థ్యం, ఎంతకాలం పనిచేస్తుందనే విషయాలపై కూడా స్వామినాథన్ స్పందించారు.
" వ్యాక్సిన్ వల్ల వచ్చే రోగనిరోధక శక్తి ఎక్కువకాలం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో యాంటీబాడీలు తగ్గినప్పటికీ కరోనా నుంచి వ్యాక్సిన్ ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం రక్షణనిస్తుంది.  అయితే బూస్టర్ డోసుల గురించి చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇందుకు సంబంధించిన పూర్తి డేటా వస్తేనే దానిపై తుది నిర్ణయం తీసుకోగలం. "
                                           - డాక్టర్ స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్
కొవాగ్జిన్ అనుమతిపై..
కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర ఆమోదం ఇవ్వడానికి ఆలస్యమైందనే వ్యాఖ్యలను స్వామినాథన్ తోసిపుచ్చారు. సాధారణంగా ఈ అనుమతి ఇవ్వడానికి 45-165 రోజులు పడుతుందని అయితే కొవాగ్జిన్‌కు 90 రోజుల్లోనే వచ్చిందని స్వామినాథన్ తెలిపారు. అయితే నిపుణుల కమిటీ, సాంకేతిక కారణాల వల్లే కాస్త ఆలస్యమైందన్నారు.


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి