21 IAS Offiecers Transfers in AP: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.


బదిలీ అయిన అధికారుల వివరాలు



  • అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా అభిషిక్త్ కిషోర్

  • శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా మంజీర్ జిలానీ

  • తిరుపతి జిల్లా కలెక్టర్ గా లక్ష్మీ షా

  • నంద్యాల జిల్లా కలెక్టర్ గా కె.శ్రీనివాసులు

  • పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా శ్రీకేష్ లాఠకర్ బాలాజీరావు

  • జీవీఎంసీ అదనపు కమిషనర్ గా విశ్వనాథన్

  • హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమణారెడ్డి

  • శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా తమీమ్ అన్సారియా

  • పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఇల్లకియా

  • కాకినాడ జాయింట్ కలెక్టర్ గా ప్రవీణ్ ఆదిత్య

  • ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా రోణంకి గోపాలకృష్ణ

  • సర్వే సెటిల్ మెంట్ అదనపు డైరెక్టర్ గా గోవిందరావు

  • డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా రోనంకి కూర్మనాథ్

  • విశాఖ జాయింట్ కలెక్టర్ గా మయూర్ అశోక్

  • విజయనగరం జాయింట్ కలెక్టర్ గా కార్తిక్

  • అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా భావన

  • ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా హరిత

  • నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రన్

  • తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అదితిసింగ్

  • పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా రేఖారాణిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: Chandrababu: 'ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం' - సీఎం జగన్ భస్మాసురుడు అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు