Today Top Headlines In AP And Telangana:
1. అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్
అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగనున్నాయి. సంక్రాంతి తర్వాత దాదాపు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు ప్రారంభంకానున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పిటకే నిర్మాణానికి సంబంధించి 45 వేల కోట్లు ఖర్చుకు ఆమోదం లభించింది.ఈ మధ్య సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్‌లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు జరిగిన గత 4 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా రూ.45,249.24 కోట్లకు ఆమోదం లభించింది. ఇంకా చదవండి.
2. కనక దుర్గమ్మకు భక్తుల భారీ కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో భక్తులు సమర్పించిన కానుకలను డిసెంబర్ 18 బుధవారం లెక్కించారు. 21 రోజులకోసారి మహామండపం అంతస్తులో ఈ లెక్కింపు సాగుతుంది. డిప్యూటీ ఈవో రత్నరాజు, దేవాదాయ శాఖాధికారులు, AEOలు, సిబ్బంది, ప్రత్యేక పోలీసులు, వన్‌టౌన్ సిబ్బంది, అమ్మవారి సేవాదారులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు. నగదు రూపంలో రూ.3,68,90,834, బంగారం 560 గ్రాములు, వెండి 9 కిలోల 30 గ్రాములు, USA డాలర్లు 519, ఆస్ట్రేలియా డాలర్లు 80. ఇంకా చదవండి.
3. రాహుల్‌కు కేటీఆర్ లేఖ
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. లేఖలో ఏం చెప్పారంటే..." కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న వైరుధ్య, ద్వంద్వ ప్రమాణాలకు సమాధానాలు కోరాలని తెలంగాణ ప్రజల తరపున నేను లేఖ రాస్తున్నారు. గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీరు, మీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇంకా చదవండి.
4. తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు
తెలంగాణ గురుకుపాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆసుపత్రులకు పరుగుల పెట్టించాయి. ఇప్పుడు మరో సమస్య వారిని వెంటాడుతోంది. విష సర్పాలు కాటేసి చంపుతున్నాయి. ఎలుకలు కొరికి చిత్రవధ చేస్తున్నాయి. మొత్తానికి గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో ఉండాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఈ మధ్య కాలంలో పాము కాటుకు విద్యార్థులు బలి అవుతున్నారు. ఇవాళ(19 డిసెంబర్ 2024 )ఉదయం యశ్విత్ అనే విద్యార్థికి పాము కాటేసింది. ఇంకా చదవండి.
5. అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత
జానపద కళాకారుడు, 'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. దీంతో పలువురు ప్రముఖులు, మూవీ లవర్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లాలోని, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న దుగ్గొండి. మొగులయ్య తన భార్య కొమరమ్మతో కలిసి బుర్రకథలు చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా చదవండి.