Top Headlines In AP And Telangana:


1. సజ్జల భార్గవ్, వర్రా రవీందర్‌పై మరో కేసు


ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్‌ పెట్టి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాళ్లపై పెడుతున్న కేసుల లిస్టు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందల కేసులు నమోదు అయ్యాయి. ఇంకా నమోదు అవుతున్నాయి. ఇందులో సజ్జల భార్గవన్ రెడ్డిసహా కీలకమైన వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్లపై మరో కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన రీతిలో విమర్శించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని సిద్దవటం మండలానికి చెందిన జనసైనికులు కేసులు పెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌ రెడ్డి ఈ పోస్టులు పెట్టించారని సిద్ధవటం పోలీసులకు జనసేన కార్యకర్త వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా చదవండి.


2. జగన్ నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి


అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదన్న ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. సమావేశం పెట్టిన రోజున నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా జగన్ నే అడిగారని..  జగన్ రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు వెళతామని చెప్పారని కానీ జగన్ వద్దే వద్దని చెప్పారని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కారణం లేకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే ఎలా అని.. ప్రజలకు ఏం సమాధానం చెబుతామని వారిలో కొంత మంది అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి.


3. ఆన్సర్ షీట్‌పై విద్యార్థి సూసైడ్ లెటర్


కుటుంబ తగాదాలు ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మన అనుకున్న బంధువులే బలి కోరుతున్నారని, ఫ్యామిలీ చిచ్చు పెడుతున్నరని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆ కుర్రాడు తన పరీక్షల ఆన్సర్‌ షీట్‌పై రాసిన సూసైడ్ నోట్ కంట తడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు, చెల్లెళ్లపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలా చనిపోతున్నందుకు బాధగా ఉందంటూ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న జెశ్వాంత్ గౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా చదవండి.


4. మీ పిల్లల ఆర్థిక భద్రతకు బోలెడన్ని ఆప్షన్స్


మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, వాళ్లకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు లేదా పొదుపు ప్రారంభించాలి. మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి... కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం నుంచి సుకన్య సమృద్ధి యోజన, బ్యాంక్ ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్‌, పిల్లల కోసం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ ప్లాన్‌ వరకు అనేక ఎంపికలు నేటి తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా, బెస్ట్‌ ఆప్షన్లను మీ ముందు ఉంచుతున్నాం. ఇంకా చదవండి.


5. సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్


విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు శుభవార్త తెలిపింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను 10-15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులపై విద్యాభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భోపాల్ ప్రాంతీయ అధికారిక వికాస్ కుమార్ అగర్వాల్ సీబీఎస్‌ఈ ప్రిన్సిపల్స్ సమావేశంలో వెల్లడించారు. ఇంకా చదవండి.