రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 33,188 నమూనాలు పరీక్షించారు. కొత్తగా.. 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా వైరస్ బారి నుంచి.. 97 మంది పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం 1,081 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.






రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కు చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు రిపోర్ట్ అయింది. 21న కువైట్‌ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. 6,856 మంది విదేశాల నుంచి వస్తే వాళ్లలో అంతా నెగిటివ్ వచ్చాకే స్వగ్రామలకు వచ్చారని తెలిపారు. వీరిలో 8 రోజులు గడిచాక 14 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అందులో ప్రత్తికోళ్ల లంకకు చెందిన 41 ఏళ్ల మహిళలు ఒమిక్రాన్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు. ఇంకా ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే 8010968295 నెంబర్‌కు చెప్పాలని సూచించారు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. వెంటనే ట్రేస్ చేసి, టెస్ట్ చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండగలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు కార్తికేయ మిశ్రా. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని అందరూ విధిగా పాటించాలని రిక్వెస్ట్ చేశారు. జిల్లాలో లక్షా 75 వేల మంది 15-18 ఏళ్ల మధ్య పిల్లలు ఉన్నారని వాళ్లకు సోమవారం నుంచి టీకాలు వేస్తున్నట్టు ప్రకటించారు. 


మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రికాషనరీ డోస్, 15-18 ఏళ్ల టీనేజర్లకు వాక్సినేషన్ ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 15-18 ఏళ్లు టీనేజర్లకు జనవరి 1వ తేదీ నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు మధ్య గల వారికి జనవరి 3 నుంచి వాక్సినేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వైద్య ఆరోగ్య సిబ్బంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు అందించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 


Also Read: AP Covid Vaccination: టీనేజర్ల వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు... జనవరి ఒకటి నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం


Also Read: Omicron : అమెరికాలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల సునామీ... హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ !


Also Read: Cotton Mask: కాటన్ మాస్క్‌లు కాపాడలేవు... అవి అలంకరణకే పరిమితం అంటున్న అంతర్జాతీయ వైద్యులు, ఏ మాస్క్‌లు మంచివంటే..