భారత్‌లో ఎన్నికల ఫలితాలు 2024
2019 ఐదేళ్ల అనంతరం 2024లో దాదాపు రెండు నెలలపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశ వ్యాప్తంగా 7 దశల్లో భారత ఎన్నికల సంఘం 18వ లోక్‌సభ ఎన్నికలు నిర్వమించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగి అక్టోబర్‌లో వాటి ఫలితాలు వచ్చాయి. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు పోలింగ్ జరగగా, ఫలితాల్ని ఈసీ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు సైతం కొలువుదీరాయి. 2025లో మొదటగా జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల సంబంధిత తాజా సమాచారం కోసం ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకోండి.
| S. No. | రాష్ట్రం | పదవీ కాలం | సంవత్సరం | మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు | మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు | మొత్తం రాజ్యసభ సీట్లు |
|---|---|---|---|---|---|---|
| 1 | ఢిల్లీ | 24 Feb 2020 - 23 Feb 2025 | 2025 | 70 | 7 | 3 |
| 2 | బిహార్ | 23 Nov 2020 - 22 Nov 2025 | 2025 | 243 | 40 | 16 |
| 3 | పశ్చిమ బెంగాల్ | 08 May 2021 - 07 May 2026 | 2026 | 294 | 42 | 16 |
| 4 | తమిళనాడు | 11 May 2021 - 10 May 2026 | 2026 | 234 | 39 | 18 |
| 5 | అస్సాం | 21 May 2021 - 20 May 2026 | 2026 | 126 | 141 | 7 |
| 6 | కేరళ | 24 May 2021 - 23 May 2026 | 2026 | 140 | 20 | 9 |
| 7 | పుదుచ్చేరి | 16 Jun 2021 - 15 Jun 2026 | 2026 | 30 | 1 | 1 |
| 8 | మణిపూర్ | 14 Mar 2022 - 13 Mar 2027 | 2027 | 60 | 2 | 1 |
| 9 | గోవా | 15 Mar 2022 - 14 Mar 2027 | 2027 | 40 | 2 | 1 |
| 10 | పంజాబ్ | 17 Mar 2022 - 16 Mar 2027 | 2027 | 117 | 13 | 7 |
| 11 | ఉత్తరప్రదేశ్ | 23 May 2022 - 22 May 2027 | 2027 | 403 | 80 | 31 |
| 12 | ఉత్తరాఖండ్ | 29 Mar 2022 - 28 Mar 2027 | 2027 | 70 | 5 | 3 |
| 13 | హిమాచల్ ప్రదేశ్ | 12 Dec 2022 - 11 Dec 2027 | 2027 | 68 | 4 | 3 |
| 14 | గుజరాత్ | 12 Dec 2022 - 11 Dec 2027 | 2027 | 182 | 26 | 11 |
| 15 | నాగాలాండ్ | 23 Mar 2023 - 22 Mar 2028 | 2023 | 60 | 1 | 1 |
| 16 | త్రిపుర | 23 Mar 2023 - 22 Mar 2028 | 2028 | 60 | 2 | 1 |
| 17 | మేఘాలయ | 23 Mar 2023 - 22 Mar 2028 | 2028 | 60 | 2 | 1 |
| 18 | కర్ణాటక | 14 May 2023 - 13 May 2028 | 2028 | 224 | 28 | 12 |
| 19 | మధ్యప్రదేశ్ | 05 Dec 2023 - 04 Dec 2028 | 2028 | 230 | 29 | 11 |
| 20 | తెలంగాణ | 05 Dec 2023 - 04 Dec 2028 | 2028 | 119 | 17 | 7 |
| 21 | రాజస్థాన్ | 05 Dec 2023 - 04 Dec 2028 | 2028 | 200 | 25 | 10 |
| 22 | ఛతీస్‌గఢ్ | 05 Dec 2023 - 04 Dec 2028 | 2028 | 90 | 11 | 5 |
| 23 | మిజోరం | 06 Dec 2023 - 05 Dec 2028 | 2028 | 40 | 1 | 1 |
| 24 | ఆంధ్రప్రదేశ్ | 06 Jun 2024 - 05 Jun 2029 | 2029 | 175 | 25 | 11 |
| 25 | ఒడిశా | 06 Jun 2024 - 05 Jun 2029 | 2029 | 147 | 21 | 10 |
| 26 | అరుణాచల్ ప్రదేశ్ | 06 Jun 2024 - 05 Jun 2029 | 2029 | 60 | 2 | 1 |
| 27 | సిక్కిం | 06 Jun 2024 - 05 Jun 2029 | 2029 | 32 | 1 | 1 |
| 28 | హర్యానా | 08 Oct 2024 - 07 Oct 2029 | 2029 | 90 | 10 | 5 |
| 29 | జమ్మూ కాశ్మీర్ | 08 Oct 2024 - 07 Oct 2029 | 2029 | 90 | 5 | 4 |
| 30 | మహారాష్ట్ర | 23 Nov 2024 - 22 Nov 2029 | 2029 | 288 | 48 | 19 |
| 31 | జార్ఖండ్ | 23 Nov 2024 - 22 Nov 2029 | 2029 | 81 | 14 | 6 |