Raithu Runalu Mafi: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ(Telangana)లో రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు రేవంత్‌రెడ్డి(Revanth ReddY) సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15న ఒకేసారి మాఫీ చేస్తామని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పదేపదే చెప్పింది. దీనికి అనుగుణంగా దేశంలో ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను తెలంగాణ అధికారులు పరిశీలిస్తున్నారు..

 

రైతు రుణాలు మాఫీకి మహారాష్ట్ర మోడల్

మహారాష్ట్ర(Maharastra)లో రూ.2 లక్షల వరకు ఉన్న  రైతుల పంట రుణాలు సుమారు రూ.20 కోట్లను ఒకేసారి మాఫీ చేశారు. సహకారశాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి రైతుల పంట రుణాలను( Raithu Runa Mafi) మహారాష్ట్ర సర్కార్ మాఫీ చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ యోచిస్తోంది. అందులో భాగంగానే  తెలంగాణ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు రెండురోజులపాటు మహారాష్ట్ర(Maharashtra)లో పర్యటించి రుణమాఫీ చేసిన విధానంపై అధ్యయనం చేశారు. రాజస్థాన్‌(Rajasthan)లోనూ ఇదే విధానం అవలంభించారు.

 

మహరాష్ట్రలో కోటిన్నర మంది రైతులు ఉండగా....వారిలో చాలామంది పంట రుణాలు తీసుకున్నారు. అయితే 2015 నుంచి 2019  మధ్య తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో అప్పటి ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చి అమలు చేసింది.రైతులకు పెద్దగా షరతులేమీ పెట్టకుండానే ఎంత భూమి ఉన్నవారికైనా అమలు చేసింది. రైతులు తీసుకున్న పంట రుణాలు అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 2 లక్షల వరకు మాఫీ చేసింది. దాదాపు రూ.20 వేల కోట్ల రుణాలను మహారాష్ట్ర ప్రభుత్వం  ఒకేసారి మాఫీ చేసింది.    

తెలంగాణలో రూ. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. అయితే తెలంగాణ(Telangana)లో అసలు రూ.30వేల కోట్లు ఉండగా...వడ్డీతో కలిపితే రూ.35వేల కోట్ల వరకు ఉండొచ్చునని అంచనా. అయితే కటాఫ్ తేదీని బట్టి ఈ సంఖ్య మారొచ్చని అధికారులు తెలిపారు. అయితే కేవలం భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి తీసుకున్న అప్పులకే రుణమాఫీ వర్తింపచేయాలా లేక..బంగారం కుదవపెట్టి తీసుకున్న అప్పులకు సైతం అమలు చేయాలన్న దానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్(KCR) సర్కార్‌....కోటీశ్వరులకు సైతం రైతుబంధు కింద లక్షలాది రూపాయలు ఇచ్చింది. దీనిపై చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద రైతుల రుణాలే మాఫీ అయితే మరోసారి అలాంటి విమర్శలే వచ్చే అవకాశం ఉందన్న సమాచారం మేరకు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రుణమాఫీ(Runa Mafi)పై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

 

సోనియాగాంధీ(Soniya Gandhi)ని తెలంగాణ ఇచ్చిన దేవతగా పదేపదే ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి....ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9ని కటాప్ తేదీగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన డిసెంబర్ 7 ని రుణాల మాఫీకి కటాప్‌ తేదీగా పెట్టే అవకాశమూ లేకపోలేదు.అయితే బ్యాంకులకు రుణాలు సొమ్ము జమ చేయడం కాకుండా....రైతుల ఖాతాల్లోనే రెండు లక్షల రూపాయలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.