PM Kisan Yojana: ప్రధానమంత్రి  కిసాన్ యోజన నిధులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించారు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయలను కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో రెండు వేల రూపాయలు ఇవాళ్టి నుంచి ఖాతాల్లో వేస్తున్నారు. ఈ పథకం ద్వారా 9.7 కోట్ల మంది రైతులు ఖాతాల్లో 20, 500 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. 

Continues below advertisement

నిధులు విడుదల చేయ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బనౌలిలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుర. ఆయన కాశీతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయానికి బాబా విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

మహాదేవుడి ఆశీర్వాదంతో ప్రతీకారం తీర్చుకున్నాను

ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రోజు నేను మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది, 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. వారి కుటుంబాల బాధ, ఆ పిల్లల బాధ, కుమార్తెల బాధ, నాకు చాలా బాధ కలిగించింది. బాధిత కుటుంబాలకు ఈ బాధను భరించే ధైర్యాన్ని ఇవ్వమని బాబా విశ్వనాథ్‌ను ప్రార్థిస్తున్నాను.' అని అన్నారు.

Continues below advertisement

"నా కూతుళ్ల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను ఇచ్చిన హామీ కూడా నెరవేరింది. ఇది మహాదేవ్ ఆశీర్వాదంతోనే నెరవేరింది. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని నేను ఆయనకు అంకితం చేస్తున్నాను" అని ఆయన అన్నారు. దీనికి ముందు, కాశీలోని ప్రతి కుటుంబానికి నమస్కరిస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన తన ప్రసంగాన్ని నమః పార్వతి పతయే, హర్-హర్ మహాదేవ్ అని ప్రారంభించారు.

ప్రధాని మోదీ భోజ్‌పురిలో ప్రజలతో కూడా మాట్లాడారు.

ప్రధాని మోదీ భోజ్‌పురిలో  పవిత్ర సావన్ మాసంలో, ఈ రోజు కాశీలో నా కుటుంబ ప్రజలను కలిసే అవకాశం నాకు లభించింది. కాశీలోని ప్రతి కుటుంబానికి నేను నమస్కరిస్తున్నాను. అని  అన్నారు. 

ఈ పర్యనలో కేవలం నిధులు విడుదల చేయడమే కాకుండా...

ప్రధానమంత్రి మోదీ కాశీలో 2200 కోట్ల విలువైన 52 ప్రాజెక్టులను ప్రారంభించారు. దల్మండి ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. బనౌలిలోని బహిరంగ సభ వేదిక వద్ద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత ప్రధాని కాశీకి చేరుకున్నారని యోగి అన్నారు.