PM Kisan Yojana : దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుకు కేంద్రం ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది తొలి విడత నిధులు ఇవాళ(2 ఆగస్టు 2025)న విడుదల చేయనుంది. వారణాసిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు. ఇప్పటికే 19 విడతలుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తూ వచ్చారు. ఇవాళ 20వ విడత నిధులు జమ చేస్తారు.
ఏటా ఆరు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ యోజన అమలు చేస్తున్నారు. ఒక్కో విడతలో రెండు వేలు చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 విడతలుగా నిధులు వేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 వ విడత నిధులు విడుదల చేశారు. వాస్తవంగా 20 వ విడత నిధులు జూన్‌లో వేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ ఉంది. మొత్తానికి ఆగస్టు 2న వేస్తున్నట్టు కేంద్రం గత వారం ప్రకటించింది. అందులో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 20వ విడతలో 20, 500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తారు. 9.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
స్టాటస్ ఎలా తెలుసుకోవాలి?
పిఎం కిసాన్ యోజనా డబ్బులు పడ్డాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన కోసం సిద్ధం చేసిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
- మొదటి స్టెప్: అధికారిక వెబ్‌సైట్: https://pmkisan.gov.inలోకి వెళ్లాలి.
- రెండో స్టెప్: హోమ్‌పేజ్‌లో“Farmers Corner” విభాగం ఉంటుంది. దానిపైక్లిక్ చేస్తే “Beneficiary Status” లేదా “Know Your Status” అనే ఆప్షన్‌లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేయాలి.
- మూడో స్టెప్: Aadhaar నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ టైప్ చేసి “Get Data”పై క్లిక్ చేయాలి.
- నాల్గో స్టెప్: స్క్రీన్‌పై మీ వివరాలు వస్తాయి. ఏ installment ఎప్పుడు జమ అయ్యిందో తెలియజేస్తుంది. తేదీ, బ్యాంక్ పేరు, UTR నెంబర్ వంటి పూర్తి సమాచారాన్ని చూసుకోవచ్చు.
e-KYC పూర్తి చేసిన వాళ్లకు మాత్రమే ఈ నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు e-KYC చేసుకోవాలని అంటున్నారు. అలా e-KYC చేయనివాళ్లకు మాత్రం నిధులు జమ కష్టమంటున్నారు. అందుకే మీ అకౌంట్‌లో డబ్బులు పడలేదు అంటే మీరు కచ్చితంగా e-KYC చేసుకోలేదని అర్థం.
- e-KYC పూర్తి చేయకుంటే నిధులు జమ కావు
- OTP ఆధారిత e-KYC లేదా బయోమెట్రిక్ e-KYC చేయించకపోతే పథకానికి అర్హత కోల్పోవచ్చు.
- Aadhaar & బ్యాంక్‌ఖాతా లింకింగ్ ఉండాలి. లేకపోయినా నిధులు జమ కావు.
- ఒకవేళ మీకు నిధులు రావడం లేదూ అంటే మాత్రం బ్యాంక్ వివరాలు సరిచూసుకోండి
- IFSC కోడ్, అకౌంట్ నెంబర్ తప్పులు లేకుండా ఉండాలి. మీరు దరఖాస్తు చేసుకున్న టైంలో తప్పుగా ఎంటర్ చేసినా నగదు పడదు.
- ఖాతా మూసివేత, బ్లాక్, ఫ్రోజెన్ లాంటివేమి ఏమైనా ఉన్నాయో లేదే ఒకసారి బ్యాంకు వారిని అడిగి తెలుసుకోండి.
- Land Record & దస్తావేజులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి.
- మొబైల్ నంబర్ అప్డేట్ ఉండాలి
- OTPలు, ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్లు సకాలంలో రావడానికి మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి.
నగదు జమ కాకుంటే ఎవర్ని సంప్రదించాలి?
- 1. హెల్ప్‌లైన్& CSC సందర్శించాలి. లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి Beneficiary Status చెక్ చేయించుకోండి. ఎక్కడ లోపం ఉందో తెలిసిపోతుంది.
- 2. IVRS (155261) లేదా సెంట్రల్ హెల్ప్‌లైన(011-24300606, 1800-115-526) ద్వారా కూడా వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. - PM-Kisan గ్రీవెన్స్ పంపిణీ:– వెబ్‌పోర్టల్‌లో“Register Grievance”పై క్లిక్ చేసి, Aadhaar/బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్‌తో ఎంటర్ చేయాలి. తర్వాత మీరు మీ సమస్యను అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫిర్యాదు చేయవచ్చు.
- ఇ-మెయిల్: pmkisan-ict@gov.in, pmkisan-funds@gov.in ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.
- జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. వారికి మీ సమస్యను నేరుగా వివరించవచ్చు.