Annadata Sukhibhava Payment Status by Aaadhaar Number: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం నిధులను విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ అన్నదాత సుఖీభవ నిధులను జమ చేస్తున్నారు. తొలి విడతగా ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్న అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో పేరు ఉండి సాంకేతిక కారణాలతో నిధులు జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

అన్నదాత సుఖీభవ నిధుల స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

  1. రైతులు తమ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అయ్యాయో ో తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం. 
  2. మొదట ప్రభుత్వం ఏర్పాటు అధికారక వెబ్‌సైట్‌  http://annadathasukhibhava.ap.gov.inలోకి వెళ్లాలి. 
  3. ఇందులోకి వెళ్లిన తర్వాత Check Status అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  4. అలా క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు నెంబర్‌ అడుగుతుంది. 
  5. ఆధార్ నెంబర్‌తోపాటు పక్కనే ఇంగ్లీష్‌, అంకెలతో ఉన్న క్యాప్చా ఉంటుంది. దాని కూడా పక్కనే ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేయాలి. 
  6. తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్‌ చేయాలి. 
  7. తర్వాత మీ స్క్రీన్‌పై సమాచారం వస్తుంది. సక్సెస్‌అని వస్తే డబ్బులు జమ అయినట్టు. 
  8. పెండింగ్ లేదా రిజెక్ట్ అని స్తే ఇంకా డబ్బులు జమ కాలేదని అర్థం. 

పేమెంట్ స్టేటస్ చెక్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ 

  • ఆధార్  నెంబర్‌
  • మొబైల్ నెంబర్ 
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు (ఇది తప్పనిసరి కాదు)

రైతు సేవాల కేంద్రాల్లో సహాయక సిబ్బంది హెల్ప్‌తో కూడా స్టేటస్ చెక్ చేయవచ్చు. రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, బ్యాంకు పాస్ బుక్‌లను ఈ కేంద్రాలకు తీసుకెళ్లి సిబ్బంది లాగిన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. 

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. 95523 00009 వాట్సాప్‌లోకి వెళ్లిన తర్వాత హాయ్ అని టైప్ చేయాలి. అనంతరం మీకు సేవలు ఎంచుకోండి అని వస్తుంది. సేవల్లో అన్నదాత సుఖీభవ సేవ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీ పేరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడిన స్టాటస్ తెలుస్తుంది. 

పేమెంట్ జమ కాలేదు అంటే ఏం చేయాలి 

మీ గ్రామ సచివాలయ సిబ్బంది లేదా బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించండి, ఆధార్ బ్యాంకు లింకింగ్ స్టేటస్ చెక్ చేయండి.

ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే 155251 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 

గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతు భరోసా అనే పేరుతో అమలు చేసింది. అప్పట్లో కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి కేవలం 13500 మాత్రమే ఇచ్చే వాళ్లు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చే ఆరు వేలతో కలిపి 20 వేలు ఇస్తోంది. మొదటి రెండు విడతల్లో ఐదేసి వేలు చొప్పున, ఆఖరి విడత నాలుగు వేలు చొప్పున మొత్తం 14 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది.