PM Kisan yojana: దేశంలో కోట్ల మంది రైతులు ఉన్నారు. భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వీరి ఖాతాలో నిధులు జమ చేస్తోంది. సంవత్సరానికి రైతులకు ప్రభుత్వం 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో 2000 రూపాయల చొప్పున మూడు వాయిదాలు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 19 వాయిదాలు చెల్లించింది. ఇప్పుడు 20వ విడత నిధులు వేస్తోంది.  

Continues below advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాలో 20వ వాయిదా డబ్బును విడుదల చేశారు. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే, మీ ఖాతాలో వాయిదా డబ్బు వచ్చిందో లేదో ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు.

20వ వాయిదా డబ్బు వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేయండి

పీఎం మోదీ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజన 20వ వాయిదా మీ ఖాతాలో వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే, ఇలా చేయండి. దీని కోసం మీరు మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించాలి. ఇక్కడ ఫార్మర్ కార్నర్ విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్'పై క్లిక్ చేయండి. దీంతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సరైన సమాచారం నమోదు చేసిన తర్వాత, మీ లబ్ధి స్టాటస్‌ పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Continues below advertisement

వాయిదా డబ్బు రాకపోతే ఏమి చేయాలి?

మీ ఖాతాలో పీఎం కిసాన్ వాయిదా డబ్బులు రాకపోతే, మొదట మీరు ఇ-కెవైసి, ఆధార్-బ్యాంక్ లింక్ , భూమికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అప్‌డేట్ చేశారో లేదో చెక్‌ చేయండి. వీటిలో ఏదైనా అసంపూర్తిగా లేదా తప్పుగా ఉంటే, వాయిదా నిలిచిపోవచ్చు. ఆ తర్వాత మీరు పీఎం కిసాన్ పోర్టల్‌లో బెనిఫిషియరీ స్టేటస్‌లో తనిఖీ చేయండి.

అక్కడ e-KYC, ఆధార్ ,ల్యాండ్ సీడింగ్‌లో 'నో' కనిపిస్తే, మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంతా సరిగ్గా ఉన్నా డబ్బు రాకపోతే, మీరు జిల్లా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 18001155261కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.