కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 15వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.  ఝార్ఖండ్ లోని ఖుంతీలో బిర్సా కాలేజీ వేదికగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ (PM KISAN Scheme) నగదు జమ చేశారు. మొత్తం రూ.18,000 వేల కోట్లు ప్రధాని మోదీ విడుదల చేయగా, దేశ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు (PM Kisan Samman Nidhi)ని అందిస్తుంది. ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ కింద అర్హులైన ప్రతి రైతుకు 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా మొత్తం రూ. 6 వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా రెండు రోజుల కిందట బిర్సా కాలేజీలో 'జనజాతీయ గౌరవ్ దివస్'ని పురస్కరించుకుని 15వ విడత పీఎం కిసాన్ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. పీఎం కిసాన్ నగదు సాయం ఖాతాల్లో జమ అయిందో లేదో రైతులకు సందేహం ఉంటే కింద తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు.


పీఎం కిసాన్ స్కీమ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
1) పీఎం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి
2) అందులో రైతుల విభాగం (Farmer Cornor)లో నో యువర్ స్టేటస్ (Know Your Status) మీద క్లిక్ చేయండి.
3) మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా (Captcha Code) ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి
4) రీ డైరెక్ట్ అయిన పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి
మీకు ఏమైనా సందేహాలు ఉంటే రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు 155261 / లేదా 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.


పీఎం కిసాన్ నగదు పడకపోయినా, మీకు వివరాలు కనిపించకపోతే రైతులు లబ్దిదారుల జాబితా (PM Kisan Beneficiary List) చెక్ చేసుకోవడంతో ప్రయోజనం ఉండనుంది.


పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాను రైతులు ఇలా చెక్ చేసుకోండి
1) మొదటగా రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి
2) హోం పేజీలో ఫార్మర్ కార్నర్ లో బెనిఫిషియ‌రీ లిస్ట్‌ (Beneficiary List) మీద క్లిక్‌ చేయాలి
3) ఓపెన్ అయిన పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను సెలక్ట్ చేసి ‘గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేయండి
4) పీఎం కిసాన్ సంబంధించి 15వ విడత ల‌బ్ధిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.

పీఎం కిసాన్ 15వ విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నదాతలు  అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. eKYC చేయించని వారిని లబ్ధిదారులు జాబితా నుంచి కేంద్రం ప్రభుత్వం తొలగిస్తోంది.