Weather Forecast 2026: ఈసారి ప్రకృతి తన వికృత రూపాన్ని ప్రదర్శించబోతోంది. 2026లో దేశం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత సామాన్యుడిని వేధించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేయగల శక్తి ఉంది.
అసలు ఎల్ నినో అంటే ఏంటీ?
ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక అసాధారణ వాతావరణ పరిస్థితి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం తూర్పు, మధ్య భాగాలలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. సాధారణం పరిస్థితుల్లో భూమధ్యరేఖ వెంబడి వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టివేస్తాయి. కానీ ఎల్ నినో సమయంలో ఈ పవనాలు బలహీనపడతాయి. దీని వల్ల వేడి నీరు వెనక్కి అమెరికా తీరం వైపు వెళ్తుంది. ఈ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఒక చోట అతివృష్టి మరోచోట తీవ్రమైన కరవు ఏర్పడుతుంది.
Also Read: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
ఎల్ నినో సూపర్ ఎల్ నినోగా ఎందుకు మారుతుంది?
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, 2026లో ఏర్పడబోయే ఎల్ నినో గత 140 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా ఉండబోతోంది. యూర్‌కు చెందిన అధునాతన వాతావరణ నమూనాలు దీనిని మెగా ఎల్ నినో గా అభివర్ణిస్తున్నారు. సముద్ర మట్టం ఉష్ణోగ్రతలుగా సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం వల్ల దీని ప్రభావం కూడా అంతే తీవ్రంగా ఉండబోతోంది. ఇది 1877 నాటి భయంకరమైన కరవు పరిస్థితులను గుర్తుకు తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే
భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
భారత్ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోని దాదాపు 51 శాతం వ్యవసాయ పనులు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. సూపర్ ఎల్ నో ప్రభావంతో 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వర్షాలు సరిగా లేకుంటే పంట దిగుబడి తగ్గి, రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు.
Also Read:కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తూర్పు, వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీయవచ్చు. కేవలం పగటిపూట మాత్రమ కాదు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం వల్ల మానవ శరీరం చల్లబడే అవకాశం దొరకదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పంట ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. సాధారణ ఎల్ నినో సమయాల్లోనే ఆహార ధరలు 5 శాతం వరకు పెరుగుతాయి. సూపర్ ఎల్ నినో వస్తే మాత్రం ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతుంది.
ప్రజలు ఏం చేయాలి
చెట్లు స్థానిక ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు తగ్గించ గలవు. కాబట్టి ఉన్న చెట్లను కాపాడుకోవడంతోపాటు కొత్త మొక్కలు నాటడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. తగినంత నీరు తాగడం, ఓఆర్‌ఎస్ వాడటం ద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అడవుల సంరక్షణ ద్వారా దీర్ఘకాలికంగా ఇటువంటి వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చు.
