Sriram Sagar Project Water: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలం జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 589.873 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. దాదాపుగా అంతే మొత్తంలో 619.628 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో గరిష్ట సాయిలోనే నీరు ఉండడంతో కాలువలకు వదిలిన నీటిని ఆయకట్టుతో పాటుగా తూముల ద్వారా చెరువులోకి తరలించనున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచే నీటి తడులను వదలాలని పలు మండలాల రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వరి నాట్లు పోస్తున్న రైతులు కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు వేయనున్నారు. కాలువల చివరి భూములకు ఆశించినట్లుగా నీరు చేరినందున తలపెట్టిన మరమ్మతులు పనులను నీటి విడుదల పూర్తి చేయాల్సి ఉంది.
కనిష్ఠ స్థాయిలోనే భూగర్భ జలమట్టం
ఒక పంటకు 55 నుంచి 60 టీఎంసీ ల నీరు అవసరం ఉండగా.. మరో 20 టీఎంసీ ల వరకు ఎత్తిపోతలు, తాగునీరు , డెడ్ స్టోరేజీ గా వెళ్తుంది. ఆయకట్టుకు నీటి రాకతో పాటుగా భూగర్భ జలమట్టం కనిష్ఠ స్థాయిలోనే ఉండటంతో ఉమ్మడి జిల్లాలో యాసంగిలో 7.29 లక్షలు ఎకరాల సాగును అంచనా వేసినా వాస్తవ సాగు మాత్రం 9.5 లక్షలు ఎకరాలకు చేరే అవకాశం ఉంది. ఎస్ ఆర్ ఎస్ పి నీటిని కొంత ఎల్ఎండిలోకి కూడా తరలిస్తారు. ఎల్ ఎండి ఎగువన ఉన్న జగిత్యాల పెద్దపల్లి ,కరీంనగర్ తదితల జిల్లాలకు ఒక నీటి షెడ్యూల్ ఉండగా, ఎల్ఎండి దిగువనున్న కరీంనగర్ ఇతర జిల్లాలకు మరో నీటి విడుదల ప్రణాళికను అమలు చేస్తారు.
పంపుసెట్ల ద్వారా రైతులు పంటలకు నీళ్లు
వరద కాలువలోకి కూడా ఎస్సారెస్పీ నీటిని అప్పుడప్పుడు విడుదల చేస్తుండడంతో జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో పంపుసెట్ల ద్వారా రైతులు పంటలకు నీటిని పారించుకుంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీటిని ఆయకట్టుకు 8 రోజుల ఆన్ పద్ధతిలో 7 రోజుల ఆఫ్ పద్ధతిలో ఇవ్వనున్నారు. డిసెంబర్ లో ఒక తడి జనవరి ఫిబ్రవరి మార్చిలో ప్రతినెల రెండు తడుల చొప్పున ఏడు నీటి తడులతో యాసంగిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అప్పటికీ పంటలు పూర్తి కాకుంటే గతంలో మాదిరిగా ఏప్రిల్ లో ఒక తడిని పెంచే అవకాశం ఉంది. కాలువలకు వదిలిన నీరు చివరికి చేరిన తరువాత చివరి నుంచి మొదటి వరకు డిస్ట్రిబ్యూటర్ల తూములను తెరుస్తూ చివరాయకట్టుకు నిరందించేలా చర్యలు తీసుకొని ఉన్నారు.ఈ యాసంగిలో ప్రధాన పంటగా వరి ఉండనుండగా ఒక మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. వారి నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. కొత్త సంవత్సరంలో ఆ డబ్బులను విడుదల చేయనున్నారు. 2023 ప్రారంభంలోనే కొత్త సంవత్సర కానుకగా 13వ వాయిదా డబ్బులను రైతులకు చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 1, 2023నే రైతుల ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.