Raat Ki Raani: రాత్ కి రాణి, అక్టోబర్ ఫ్లవర్, షియులీ, నైట్ జాస్మిన్.. ఎలా పిలిచినా ఆ పువ్వు సువాసన, అందం మాత్రం వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇది తెల్లగా ఉంటుంది. తెలుపు వర్ణంతో ఆకట్టుకుంటుంది. ఈ తెల్లని రాత్రి వేళ వికసించే జాస్మిన్ లు సెస్ట్రమ్ నోక్టర్నమ్ అనే మొక్కకు వికసిస్తాయి. ఇది సొలనేసి కుటుంబానికి చెందినది. ఇందులో బంగాళ దుంపలు, టమోటాలు అలాగే దిన్ కా రాజా అని పిలిచే ప్రసిద్ధ మొక్క కూడా ఉంటాయి. దాని కాండం, ఆకుపచ్చ- తెలుపు లేదా పసుపు పువ్వులు రాత్రి పూట వికసించి బలమైన సువాసనను వెదజల్లుతాయి. ఈ గాఢమైన వాసనకు సీతాకోకచిలుకలు, ఇతర కీటకాలు ఆకర్షించబడతాయి. ఈ మొక్కకు సుదీర్ఘంగా పుష్పించే కాలం ఉంటుంది. రాత్రిపూట వికసించే జాస్మిన్ త్వరగా విస్తరించే చెక్క పొద సెస్ట్రమ్ నోక్టర్నమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ పూలు వేసవి అంతా వికసిస్తాయి. సూర్యరశ్మి పడే చోట అలాగే వెచ్చదనం పుష్కలంగా ఉన్న గ్రీన్ హౌస్ లు, కుండలలో రాత్రి పూట ఈ జాస్మీన్ లు వికసిస్తాయి. 


రాత్ కి రాణి మొక్కను ఎలా నాటాలి? 


ఎండ తగిలే ప్రదేశంలో మొక్కను నాటాలి. ఈ మొక్కలకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. కాబట్టి సూర్య కిరణాలు నేరుగా తగిలే చోట మాత్రమే వీటిని నాటాలి. అలాంటి ప్రదేశం లేకపోతే.. కొద్దిగా నీడ పడే చోట పెట్టుకుని.. రోజూ 6 గంటల పాటు సూర్య కిరణాలు తగిలేలా చూసుకోవాలి. 


పేసింగ్ ముఖ్యం?


రాత్ కి రాణి మొక్కలను ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలనుకుంటే ఒక్కో మొక్క మధ్యలో 4 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇలా నాటడం వల్ల మొక్కల కొమ్మలు విస్తరించడానికి వేళ్లు మట్టిని సరిగ్గా పట్టుకోవడానికి సులభం అవుతుంది. 


ఎండిపోయిన నేలే కావాలి?


ఈ మొక్క ఇసుక నేలలో ఉత్తమంగా పెరుగుతుంది. మంచి పోషకాలు ఉన్న ఎండిపోయిన గట్టి నేలలో ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. 


నీరు ముఖ్యం?


రాత్ కి రాణి మొక్కకు ఎక్కువగా నీళ్లు కావాలి. వేళ్లు పెరిగే సమయం రోజు తప్పి, రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి. వేళ్ల వద్ద మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. 


సంరక్షణ..!


రీపోటింగ్: రూట్ బౌండ్ పరిస్థితులను నివారించడానికి, రాత్రి పూట వికసించే జాస్మిన్ కంటైనర్ లో ఉంటే ప్రతి రెండేళ్లకోసారి ఈ మొక్కను తిరిగి నాటాల్సి ఉంటుంది. ఈ మొక్కలకు నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా వారానికొకసారి అయినా నీళ్లు పట్టడం మాత్రం మరిచిపోవద్దు. సెప్టెంబరులో ఈ పూలు ఎక్కువగా పూస్తాయి. రాత్రి పూట పూలు వికసించిన తర్వాత తెల్లవారు వాటిని సరిగ్గా కత్తిరించాలి. చక్కగా కత్తిరిస్తే మొక్క మరింత చక్కగా పెరుగుతుంది. రాత్రిపూట వికసించే ఈ మొక్కకు తెగుళ్లు ఎక్కువగానే ఉంటాయి. అఫిడ్స్, గొంగళి పురుగులు దీని ప్రధాన శత్రువులు, ఈ క్రిములు వ్యాపించినట్లు గుర్తిస్తే క్రిమిసంహారక మందులు వాడాలి.