ఈ రాశులవారు ఉత్తమ భర్తలు



పెళ్లికి ముందు ఎవరెలా ఉన్నా..పెళ్లైన తర్వాత మాత్రం ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని, చెప్పిన మాట వినాలని భావిస్తారు. కొందరి విషయంలో మాత్రం పెళ్లైనా కానీ పెద్దగా మార్పులేమీ ఉండవు కానీ మరికొందరు మాత్రం ఊహించనంతగా మారిపోతారు.



ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ చిన్న అనుమానానికి కూడా తావివ్వకుండా జాగ్రత్తపడతారు. అందుకే వీరు ఉత్తమ భర్తలుగా క్రెడిట్ అందుకుంటారు.



అయితే ఇది కూడా వారి రాశిని బట్టి ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఏ రాశులవారు ఉత్తమ భర్తలుగా నిలుస్తారో చూద్దాం...



మేషం
మేష రాశి వారు మంచి భర్తలు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామి మనోగతాన్ని తెలుసుకుని మసలుకుంటారు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించినా ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఎప్పుడూ భార్యకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.



సింహం
సింహ రాశి వారు ఎవ్వరి అభిప్రాయాలను అంత తేలిగ్గా అంగీకరించరు కానీ...పెళ్లయ్యాక మాత్రం తమ జీవితాన్ని తీసుకెళ్లి భాగస్వామి చేతిలో పెట్టేస్తారు. అప్పటి నుంచి ఆమె చెప్పుచేతల్లోనే ఉంటారు. తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.



మకరం
మకర రాశివారు మొండితనానికి కేరాఫ్ అడ్రస్. ఎవ్వరి మాట వినరు సీతయ్యలా ప్రవర్తిస్తారు. కానీ ఇదంతా పెళ్లయ్యే వరకూ మాత్రమే. పెళ్లైన తర్వాత మాత్రం వీరు ఎవ్వరూ ఊహించనంతగా మారిపోతారు. తమ జీవిత భాగస్వామితో మంచి చెడులను పంచుకుంటారు.



కుంభం
వీరు పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్లైన తర్వాత తమ జీవితభాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటారు. వారికోసం సమయాన్ని వెచ్చిస్తారు. చిన్నచిన్న సమస్యలున్నా పరిష్కరించుకోవాలి అనుకుంటారు. బంధాన్నిమరింత బలోపేతంచేసేందుకు తమవంతు ప్రయత్నాలన్నీ చేస్తారు.



మీనం
మీన రాశివారికి సహనం చాలా ఎక్కువట. అనవసరంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ పెళ్లయ్యాక మాత్రం తమ మనసులో మాటలన్నీ భార్యకు చెప్పుకోవడంలో వీరే నంబర్ వన్. తమను తమ జీవిత భాగస్వామి పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని భావిస్తారు.



ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...