ఈమధ్య నకిలీ పాన్ కార్డుల మోసాలు ఎక్కువయ్యాయి. పాన్ పైన క్యూఆర్ స్కాన్ చేయడం వల్ల నకిలీ, నిజమైనవి గుర్తించొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. పాన్ కార్డు అసలు, నకిలీ తెలుసుకొనేందుకు ముందుగా మీరు ఆదాయపన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. మొదట www.incometax.gov.in/iec/foportal ను సందర్శించాలి. ఆ తర్వాత 'వెరిఫై యువర్ పాన్' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న పాన్ సమాచారం మొత్తం ఫిల్ చేయాలి. పాన్ కార్డు సంఖ్య, పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేయగానే మీరు ఇచ్చిన సమాచారం మ్యాచ్ అవుతుందో లేదో సమాచారం మొబైల్‌కు వస్తుంది. ఈ సమాచారం ద్వారా మీరు పరిశీలిస్తున్న పాన్ కార్డు సరైందో కాదో తెలుసుకోవచ్చు.