‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు తాళాల గుత్తిని కొట్టేసిన ఈ నిహారిక ఎవరో తెలుసా? నిహారిక Nm.. ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. ఈమెను జస్ట్ చూస్తే చాలు.. తెలియకుండానే మీరు నవ్వేస్తారు. మహేష్ బాబు, యశ్‌లను సైతం ఈమె ఫిదా చేసింది. నిహారికకు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషలు కూడా తెలుసు. కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్శిటీలో నిహారిక ఎంబీఏ పూర్తి చేసింది. ఇన్‌స్టా్గ్రామ్‌లో ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. నిజ జీవిత ఘటనలపై ఈమె ఫన్నీ వీడియోలు చేస్తూ నవ్విస్తోంది. బాలీవుడ్ హీరో షహీద్ కపూర్, అజయ్ దేవగన్ సైతం ఆమెతో కలిసి ఫన్నీ వీడియో చేశారు. నిహారికకు మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. నిహారిక తాజాగా.. మహేష్ బాబుతో చేసిన రీల్ వీడియో వైరల్‌గా మారింది. Images and Videos Credit: Niharika NM/Instagram