శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాన్' మే 13న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి? మినీ రివ్యూ చూడండి.

కథ: చక్రవర్తి (శివకార్తికేయన్) బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అతడికి ప్రొఫెసర్ భూమినాథం (ఎస్.జె. సూర్య) పెట్టే రూల్స్ నచ్చవు. 

చక్రవర్తి వేసిన ప్లాన్ వల్ల భూమినాథం కాలేజీ నుంచి వెళతాడు. స్టూడెంట్స్ అంతా హ్యాపీ. అయితే, రెండు నెలల్లో భూమి తిరిగొస్తాడు. 

తాను కాలేజీ నుంచి వెళ్లడానికి చక్రవర్తి కారణం అని తెల్సిన భూమి ఏం చేశాడు? చక్రవర్తి తండ్రి (సముద్రఖని) పాత్ర ఏమిటి? అనేది కథ. 

ఎవరెలా చేశారు?: శివకార్తికేయన్ పక్కింటి కుర్రాడిలా, ఆకతాయి పోరడుగా చేశారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా చేశారు. 

ప్రియాంకా అరుల్ మోహన్ అందంగా కనిపించారు. ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ యాప్ట్. 

భూమినాథం పాత్రలో ఎస్.జె. సూర్య నటన సినిమాకు హైలైట్. ప్రొఫెసర్ పాత్రలో ఆయన సూపర్.

తండ్రిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తారు. మిగతా నటీనటులు బాగా చేశారు.

లవ్ సీన్స్, ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ బావుంది.

సంగీతం: వినడానికి పాటలు బావున్నాయి. కానీ, కథకు అడ్డు తగిలాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం బావుంది. 

ఛాయాగ్రహణం: సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. టెక్నికల్, ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

సినిమా ఎలా ఉంది?: 'డాన్' కథ కొత్తది అని చెప్పలేం. కానీ, కథను కొత్తగా ప్రజెంట్ చేసిన తీరు బావుంటుంది. 

రొటీన్ కథకు కామెడీ, ఎమోషన్స్ యాడ్ చేసి ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు దర్శకుడు శిబి చక్రవర్తి. 

కాలేజీ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ బావున్నాయి.

చివరగా: కథ, సన్నివేశాలు ఊహాజనితంగా ఉండటం మైనస్. అయితే, ఈ 'డాన్' నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఎంటర్టైన్ చేస్తాడు.

ఫైనల్ టచ్: వీడు 'పైసా వసూల్' డాన్. టికెట్ రేటుకు న్యాయం చేస్తాడు. (All images courtesy: Lyca Productions / Instagram)