ఈ రాశులవారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు
ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు



కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.



మిథున రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఇంకొన్ని రోజులు నిరాశ తప్పదు. ఆరోగ్యం విషయంలో కొన్ని చికాకులు తప్పవు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలుండవు. ఉద్యోగులు ఉన్నతస్థాయి వ్యక్తుల ఆదేశాలు పాటించడం మంచిది. పనిభారం పెరుగుతుంది. వారం మధ్యలో విందువినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కలసొస్తుంది.



తులా రాశి
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలుంటాయి. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి.



సింహ రాశి
ఈ రాశివారు ఈ వారం ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. గత కొద్దిరోజులుగా ఉద్యోగులను వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయవర్గాలకు అనుకూల సమయం.



ధనుస్సు రాశి
ఈ రాశివారు ఈ వారం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులు గతంలో చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.



మకర రాశి
ఈ రాశివారు సంకల్పబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏదో తెలియని ఆటంకాలుంటాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. వ్యాపారంలో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.



కుంభం
తలపెట్టిన పనులు ఫాస్ట్ గా పూర్తవుతాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు సాధ్యమవుతాయి. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు సమసిపోతాయి.



(Image‌s Credit: Freepik)