IMD ప్రకారం, నైరుతి రాజస్థాన్, దాని సమీప ప్రాంతాల్లో పశ్చిమ డిస్ట్రబెన్స్ పాక్షికంగా చురుకుగా ఉంది. దక్షిణ కొంకణ్, మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ద్రోణి అంటే అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా, మార్చి 6 నుండి 8 వరకు మధ్య భారతంలో తేలికపాటి, మోస్తరు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం మార్చి 6 నుంచి 9 వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 36 నుంచి 40 మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఏపీ వ్యాప్తంగా పొడివాతావరణమే, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం