నేడు నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం



నిన్నటి ద్రోణి ఈ రోజు తూర్పు విదర్భ నుండి మరాత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా..



కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది.



దిగువ స్థాయిలో గాలులు ఈ రోజు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.



తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, మరో మూడు రోజుల పాటు 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం



పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా ఏపీ వైపుగా వీస్తుండడం వల్లే అధిక ఉష్ణోగ్రతలు