తూర్పు నుండి వీచే గాలులలో ఏర్పడిన ద్రోణి ఈ రోజు కేరళ నుండి అంతర్గత కర్నాటక, మరఠ్వాడా మీదుగా విధర్భ వరకు..



సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది.



తెలంగాణ రాష్ట్రంలో, ఆగ్నేయం నుండి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి.



రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.



ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా తక్కువ స్థానాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం



నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.9 డిగ్రీలుగా నమోదు, గాలిలో తేమ 68 శాతం.