ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే! ఆది సాయి కుమార్ నటించిన ‘సీఎస్ఐ సనాతన్‘ మార్చి 10న విడుదల కానుంది. వసంత్ సమీర్, శౌర్య శ్రీనివాస్, సద్దాం, సౌమ్య మీనన్ కీలక పాత్రలు పోషించిన ‘టాక్సీ‘ ఈ వారంలో రిలీజ్ కానుంది. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని, కసి విశ్వనాథ్ నటించిన ‘నేడే విడుదల‘ మార్చి 10న విడుదల కానుంది. కార్తికేయ, అఖిల నాయర్ నటించిన ‘వాడు ఎవడు‘ ఈ వారంలో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ ‘65‘ ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వెంకటేష్, రానా నటించిన ‘రానా నాయుడు‘ వెబ్ ఫిల్మ్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. మడోన్నా సెబాస్టియన్, సుహాస్, బిందు మాధవి నటించిన ‘యాంగర్ తాలీస్ ఈ నెల 9న ‘ హాట్ స్టార్ లో విడుదల కానుంది. యోగి బాబు కీలక పాత్రలో నటించిన మూవీ ‘బొమ్మై నాయగి‘ ఈ వారంలో జీ5లో విడుదల కానుంది.