ఈ కోడిగుడ్ల నిండా కరోనా యాంటీబాడీలే

కరోనా వైరస్‌ను తట్టుకునేలా ఆహారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

వీటిని తింటే కరోనాను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది.

పక్షుల్లో IgY అనే యాంటీ బాడీ ఉంటుంది. ఇది మనుషుల్లో ఉండదు.

కోడి గుడ్లలో కూడా ఈ యాంటీ బాడీ ఉంటుంది.

మూడు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో కోళ్లకు అందించారు.

ఆ వ్యాక్సిన్లలోని ప్రతిరోధకాలలోని శక్తి కోళ్లు పెట్టిన గుడ్లకు కూడా వచ్చింది.

ఆ కోడిగుడ్లలోని యాంటీ బాడీలు కరోనా వైరస్‌ను తటస్థీకరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

కరోనా చికిత్స విషయంలో ఇది మంచి ఆవిష్కరణ అనే చెప్పాలి.