స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ పొందడం కన్నా క్యాపిటల్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం! వారెన్ బఫెట్ వంటి బడాబడా ఇన్వెస్టర్లు మొదట మన డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవాలనే చెప్తారు. మరి ఫాలింగ్ మార్కెట్లో ఎక్కువ డబ్బు నష్టపోవద్దంటే స్ట్రిక్ట్‌గా స్టాప్ లాస్ పెట్టుకోవడం కంపల్సరీ! మార్కెట్లో ఒలటిలిటీ ఎక్కువగా ఉన్న ఇలాంటి టైమ్‌లోనే ట్రేడర్లు స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది. లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లకు స్టాప్‌లాస్ అవసరం ఎక్కువగా ఉండదు. ఫండమెంటల్స్, మూమెంట్ చూసుకొని షేర్లను కొనుగోలు చేస్తే దాదాపుగా ప్రాఫిట్ వస్తుంది. వారం, రెండు వారాల్లో మార్కెట్ పతనం వారిని ఇబ్బంది పెట్టదు. ట్రేడర్లకు మాత్రం అలా కాదు. పెట్టుబడిని రక్షించుకోవడం ముఖ్యం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తక్కువ నష్టంతో బయటపడి మరో ఆపర్చునిటీ వెతుక్కోవడమే ఇంపార్టెంట్. ఈ స్టాప్‌లాస్ థియరీని కొందరు 'ఫెయిల్ ఫాస్ట్' అప్రోచ్ అంటారు. దీని ప్రకారం స్టాప్‌లాస్ హిట్టైతే ఫర్వాలేదు. త్వరగానే నేర్చుకొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. తర్వాత బెస్ట్ ట్రేడ్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.