ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 75 పాయింట్లు తగ్గి 17,076 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 289 పాయింట్లు తగ్గి 57,925 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 382 పాయింట్లు తగ్గి 39,616 వద్ద స్థిరపడింది. హిందాల్కో, మారుతీ, నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 40 పైసలు బలపడి 82.26 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.59,780 గా ఉంది. కిలో వెండి రూ.1000 ఎగిసి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.26,200 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 2.22 శాతం తగ్గి రూ.23.37 లక్షల వద్ద కొనసాగుతోంది.