బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్బు విత్‌డ్రా చేసే ప్రాసెస్!
మనం ఎంత సంపాదిస్తున్నా ఒక్కోసారి నగదు కొరత ఎదుర్కోక తప్పదు.
అలాంటప్పుడు ఆపద్భాందవుడిలా ఆదుకుంటుంది ఓవర్ డ్రాఫ్ట్ (OD Fecility)!
అకౌంట్లో ఒక్క రూపాయి లేకున్నా ఈ సౌకర్యంతో అవసరమైన డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల రూపంలో ఓడీ డబ్బు సాయం చేస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లను తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాన్ని సెక్యూర్డ్‌గా భావిస్తారు. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓడీ ఫెసిలిటీ అందిస్తున్నాయి.
ఎఫ్‌డీపై తీసుకొనే ఓడీపై 100-200 బేసిస్ పాయింట్లు వడ్డీ తీసుకుంటారు. ముందుగా నిర్ణయించిన రేటుకే వడ్డీని నిర్ణయిస్తారు. రోజువారీగా లెక్కించి నెలకోసారి డెబిట్ చేస్తారు.
ఉదాహరణకు బ్యాంకులో మీకు 10 శాతం వడ్డీతో రూ.లక్ష ఎఫ్‌డీ ఉందనుకుందాం. ఓడీ కింద రూ.10వేలు విత్‌డ్రా చేసి 20 రోజుల తర్వాత జమ చేశారనుకుందాం.
అప్పుడు బ్యాంకు మీకు రూ.54.8 వడ్డీ ((10% of Rs.10000) x 20/365) వేస్తుంది. ఒకవేళ మీరు ముందుగానే డబ్బు చెల్లిస్తే ప్రీ పేమెంట్ రుసుములేవీ తీసుకోరు.
ఎఫ్‌డీపై ఓడీకి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. జీవిత బీమా, కేవీపీ, ఎన్‌ఎస్‌సీ వంటి సెక్యూరిటీలపై తీసుకుంటే 0.1 నుంచి 1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు