9 ఏళ్లలో లక్షకు రూ.82 లక్షల రాబడి ఇచ్చిన షేరు! గతేడాది నవంబర్ నుంచి స్టాక్ మార్కెట్లు బాగా నష్టపోయాయి. ఐటీ కంపెనీల షేర్లైతే కనీసం 30-50 శాతం మేర క్షీణించాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ ఏడాది 42 శాతం రాబడి ఇచ్చింది టాటా ఎలెక్సీ షేరు. తొమ్మిదేళ్లలో ఈ కంపెనీ షేరు ధర రూ.102 నుంచి రూ.8,370కి చేరుకుంది. దాదాపుగా 8100 శాతం రాబడి ఇచ్చింది. టాటా ఎలెక్సీలో తొమ్మిదేళ్ల క్రితం లక్ష పెడితే ఇప్పుడు రూ.82 లక్షలు చేతికొచ్చేవి. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసుంటే ఇప్పుడు రూ.9.60 లక్షలు అందేవి. ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రెండు లక్షల వరకు అందుకొనేవాళ్లు. ఈ ఏడాది ఆరంభంలో లక్ష రూపాయలు పెట్టుంటే ఇప్పుడు రూ.1.42 లక్షలు చేతికొచ్చేవి. నెల రోజుల క్రితం పెట్టుంటే ఇప్పుడు రూ.1.075 లక్షలు అందేవి. ఆరు నెలల కిందటైతే రూ.1.19 లక్షలు వస్తాయి.