ఐపీఎల్ 2024 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీపై సీఎస్కే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం. ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఐదు సార్లు ఆడగా నాలుగు సార్లు ఓటమి చవిచూసింది. 2021లో ఒకే ఒక్కసారి ముంబై ఇండియన్స్‌పై రెండు వికెట్లతో విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలిచి 16 సంవత్సరాలు అవుతోంది. ఐపీఎల్ 2008 సీజన్ తర్వాత ఒక్కసారి కూడా చెన్నైలో చెన్నైపై బెంగళూరు గెలవలేదు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ కలిపి 349 పరుగులు సాధించాయి. కానీ ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు కాలేదు. ఐపీఎల్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాని మ్యాచ్‌లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే. ఐపీఎల్‌లో ఆర్సీబీపై చెన్నైకి ఇది 21వ విజయం. ఒక జట్టుపై అత్యధిక విజయాల్లో ఇది సెకండ్ హయ్యస్ట్. మొదటి స్థానంలో ముంబై ఉంది. కోల్‌కతాపై ముంబై 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.