కింగ్ కోహ్లీ నాలుగు సార్లు ఈ మార్కును దాటడం విశేషం. 2012లో ఐదు, 2017లో ఆరు, 2018లో ఐదు, 2019లో ఐదు సెంచరీలను విరాట్ సాధించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సార్లు దీన్ని దాటడం విశేషం. 2017లో ఆరు, 2018లో ఐదు, 2019లో ఏడు సెంచరీలను రోహిత్ సాధించాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్‌ను రెండు సార్లు సాధించాడు. 1996, 1998ల్లో సచిన్ రెండు సార్లు వన్డేల్లో ఐదు సెంచరీల మార్కును దాటాడు. ఈ లిస్టులో సౌరవ్ గంగూలీ పేరు కూడా ఉంది. 2000 సంవత్సరంలో సౌరవ్ గంగూలీ ఏడు వన్డే సెంచరీలు కొట్టాడు. 1999లో రాహుల్ ద్రవిడ్ వన్డేల్లో ఆరు సెంచరీలు కొట్టాడు. 2023లో శుభ్‌మన్ గిల్ ఐదు వన్డే సెంచరీలు సాధించాడు.