ఆర్సీబీ మహిళల జట్టు కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ సాధించిన ట్రోఫీలు, అవార్డులు ఇవే. ఏకంగా ఆరు సార్లు టీ20 ప్రపంచ కప్ కొట్టిన జట్టులో సభ్యురాలు. రెండు సార్లు ప్రపంచకప్ కొట్టిన జట్టులో సభ్యురాలు రెండు సార్లు బిగ్‌బాష్ లీగ్ విజేతగా నిలిచిన జట్టులో భాగం. క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు గ్రహీత వన్డే క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు గెలుచుకుంది. టీ20 క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు సాధించింది. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రెండు సార్లు గెలిచింది. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మొదటిసారి డబ్ల్యూపీఎల్ గెలిచిన జట్టులో భాగం అయింది.