అగరుబత్తి - ధూపబత్తి మధ్య తేడా?

Published by: RAMA

అగరుబత్తి - ధూపబత్తి మధ్య వ్యత్యాసం వాటి తాయరీపై ఆధారపడి ఉంటుంది

అగరుబత్తి సున్నితమైనది, సన్నని వెదురుపుల్లలపై సుగంధ ద్రవ్యాలు, కలప పొడి, సహజ మిశ్రమాన్ని పూస్తారు

ధూపబత్తిలో వెదురు పుల్ల ఉండదు.. సుగంద ద్రవ్యాలు ముద్దగా చేసిన పేస్ట్ ను శంఖువు ఆకారంలో తయారు చేస్తారు

అగరుబత్తి ఎక్కువసేపు కాలుతాయి.. తేలికపాటి సువాసన వెదజల్లుతాయి

వెదురుపుల్ల ఉండడం వల్ల కాలేటప్పుడు తక్కువ సువాసన వస్తుంది

ధూపం సాంప్రదాయకంగా శుద్ధీకరణకు ఉపయోగిస్తారు

దూపబత్తి మధ్యలో వెదురు లేనందున పూర్తి సుగంధభరితమైన వాసన వెదజల్లుతుంది

అగరుబత్తితో పోల్చితే ధూపబత్తి నుంచి వచ్చే పరిమళం ఇల్లంతా త్వరగా వ్యాపిస్తుంది

అగరుబత్తి, ధూపబత్తి ఏదైనా చెడు శక్తిని తొలగించేందుకు వెలిగిస్తారు