శృతిహాసన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. ‘క్రాక్’ సినిమా హిట్‌తో శృతికి అవకాశాలు క్యూ కట్టాయి. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చిత్రంలో శృతి నటిస్తోంది. బాలకృష్ణతో NBK 107లో నటిస్తోంది. చిరంజీవి 154వ చిత్రంలో కూడా నటించేందుకు సైన్ చేసింది. ఇంత బీజీలోనూ శృతి తన అభిమానులకు టచ్‌లోనే ఉంది. తాజాగా ఓ యాప్‌తో తన సెలబ్రిటీ ట్విన్ ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలో ఫన్నీగా ఎలోన్ మస్క్ ఫొటోను ఆమెకు ట్విన్‌గా వచ్చింది. దీంతో శృతి ‘నాన్‌సెన్స్’ అంటూ ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Image Credit: Shruti Haasan/Instagram