బుల్లి తెరలో అందమైన యాంకర్ ఎవరని అడిగితే అంతా శ్రీముఖి పేరే చెబుతారు. అందం మాత్రమే కాదు, అల్లరిలోనూ శ్రీముఖి తర్వాతే ఎవరైనా. శ్రీముఖి నోరు విప్పితే మాటల ప్రవాహనికి ఆనకట్ట వేయడం కష్టమే. శ్రీముఖి మాంచి ఫుడ్ లవర్. సన్నగా నాజుగ్గా ఉండేందుకు శ్రీముఖి ఎంత శ్రమించినా.. తిండి దగ్గర రాజీ పడలేకపోతోంది. ఒక వైపు వ్యాయామాలు చేస్తూనే.. మరోవైపు నచ్చినవి తింటూ బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రీముఖి తన కోసం వచ్చిన ‘లంచ్’ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసి ‘అమ్మో, శ్రీముఖి.. అంత తింటావా’ అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. Images and Videos Credit: Sreemukhi/Instagram