సమంత తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 



ఈ ఫొటోల్లో సమంత ఓ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేసింది. దీంతో ఆమె వస్త్రధారణ హాట్ టాపిక్ గా మారింది.



చాలా మంది నెటిజన్లు ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ విషయంలో సమంత హర్ట్ అయినట్లు ఉంది. 



దీంతో ట్రోలర్లను టార్గెట్ చేస్తూ.. సమంత ఓ పోస్ట్ పెట్టింది. 



మహిళలపై వారు ధరించే బట్టలు, మతం, విద్య, కనిపించే తీరు, రంగు ఇలా ఎన్నో రకాల వివక్షను చూపిస్తుంటారని చెప్పింది. 



మహిళలను చాలా ఈజీగా జడ్జ్ చేస్తుంటున్నారని.. మనం 2022లో ఉన్నామని.. ఇప్పటికైనా జడ్జ్ చేయడం ఆపరా..? అని ప్రశ్నించింది. 



అమ్మాయిలు ఏం ధరించారు..? ఎలా కనిపిస్తున్నారనే దానిపై వారి క్యారెక్టర్ ని ఎలా నిర్ణయిస్తారని అసహనం వ్యక్తం చేసింది. 



సమంత పోస్ట్ చూస్తుంటే ఆమె బాగా హర్ట్ అయినట్లు ఉందనిపిస్తుంది.



ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది.