రూపాయి బలహీనత ఇప్పట్లో ఆగేలా లేదు.

శుక్రవారం మరోసారి జీవిత కాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

డాలర్‌తో పోలిస్తే తొలిసారి 82 మార్క్‌ దాటి పతనమైంది.

క్రూడాయిల్‌ ధర, యూఎస్‌ బాండ్‌ యీల్డుల పెరుగుదలే కారణం.

శుక్రవారం ఉదయం రూపాయి 82.30 వద్ద ట్రేడైంది.

గురువారం ముగింపు 81.89తో పోలిస్తే 0.5 శాతం పతనమైంది.

ఒపెక్‌ కూటమి ఉత్పత్తి తగ్గించడంతో క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 93 డాలర్లకు చేరింది.

గత వారంతో పోలిస్తే బ్యారెల్‌కు 11 శాతం పెరిగింది.

పదేళ్ల యూఎస్‌ ట్రెజరీ యీల్డు మంగళవారం నుంచి 18 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి.

క్రూడ్‌ 100 డాలర్లకు చేరితే రూపాయి ఇంకా పతనమవుతుంది.