ఉత్తర, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం వాయుగుండంగా మారింది. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారుతుంది అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తుపాను తీరం దాటనుంది సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో వానలు అక్టోబరు 23 వరకూ తెలంగాణలో వాతావరణం ఇలాగే ఉండనుంది సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల మోస్తరు వర్షాలున్నాయి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా వానలు అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.