ప్రియాంక జవాల్కర్.. ‘ట్యాక్సీవాలా’తో హాయ్ చెప్పిన ఈ క్యూటీ గుర్తుందా? ‘SR కళ్యాణమండపం’ తర్వాత ప్రియాంక మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ఆమె మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు టాక్. కానీ, అప్‌డేట్స్ లేవు. ఇటీవల ఓ క్రికేటర్‌తో ప్రేమాయణమంటూ ప్రియాంక వార్తల్లోకి ఎక్కింది. ఆ వార్తతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. కొద్ది రోజుల కిందట ప్రియాంక ఓ అబ్బాయితో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి ప్రియాంక ప్రేమలో పడిందని అంతా అనుకున్నారు. కానీ, ఆ వార్తలను ఆమె ఖండించింది. తాజాగా ప్రియాంక బ్లాక్ డ్రెస్ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకు మళ్లీ నిద్రలేకుండా చేస్తోంది. పాలంత స్వచ్ఛమైన నీ అందానికీ GST వేస్తారేమో అని ఫ్యాన్స్ చమత్కరిస్తున్నారు. అదీ నిజమే కదా, అసలే పాల ఉత్పత్తులు ఖరీదాయే! Image Credit: Priyanka Jawalkar/Instagram