పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - చిన్న మొత్తాలలో చేసే సాధారణ డిపాజిట్లతో పెద్ద కార్పస్‌ను రూపొందించడానికి వీలు కల్పించిన పథకం.

PPFలో పెట్టుబడులపై పన్ను వర్తించదు. లబ్ధిదారులు రూ.2 కోట్లకు పైగా కార్పస్ ఫండ్‌ను సృష్టించవచ్చు. PPF స్కీమ్ సంవత్సరానికి 7.1 శాతం హామీతో రాబడిని అందిస్తుంది.

35 ఏళ్ల పాటు ఏటా రూ.46,800 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. పన్ను పరిధిని బట్టి ఇతరులకు మినహాయింపు పరిమితి మారవచ్చు.

PPF అకౌంట్‌ను పోస్టాఫీసు, బ్యాంకులో ఓపెన్ చేయవచ్చు. ఒక ఏడాదిలో రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు.

పీపీఎఫ్ మెచూరిటీ వ్యవధి 15 ఏళ్లు. 5 ఏళ్ల బ్లాక్‌ పీరియడ్‌తో అనేక సార్లు మెచూరిటీని పొడిగించుకోవచ్చు. 25 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే 60 ఏళ్లు వచ్చేసరికి రూ.2.26 కోట్ల కార్పస్ సృష్టించవచ్చు.

PPFలో రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. ఆర్థిక సంవత్సరం చివరిలో రూ.10,650 రాబడిని ఇస్తుంది. ఇలా ఏటా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు రూ.40,68,209 అందుతాయి.

ఇందులో రూ.22.5 లక్షలు మీ పెట్టుబడి కాగా, రూ.18,18,209 వడ్డీ రాబడి ఉంటుంది. 25 ఏళ్లకే పెట్టుబడి ప్రారంభిస్తే 40 ఏళ్లు వచ్చేసరికి మీ అకౌంట్‌లో రూ.40.68 లక్షలు ఉండే అవకాశం ఉంది.

PPF మెచూరిటీని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ, అదే పద్ధతిలో పెట్టుబడిని కొనసాగించవచ్చు.

మొదటి పొడిగింపు ముగిసి 45 ఏళ్ల వయసు వచ్చేసరికి మీ అకౌంట్‌లో రూ.66,58,288 ఉంటుంది. ఇందులో రూ.30 లక్షలు మీ పెట్టుబడి, రూ.36,58,288 వడ్డీ రాబడి.

అలాగే మరో మూడుసార్లు మెచూరిటీని పొడిగిస్తూ వెళ్తే.. మీకు 60 ఏళ్లు వచ్చే సమయానికి మీ PPF అకౌంట్‌లో రూ.2,26,97,857 ఉండవచ్చు.